క‌రోనా పాజిటివ్.. త‌ప్పుడు రిపోర్ట్ అనుకుంటా | Rapper Raftaar Tests Positive For COVID-19 He Feel Its A Technical issue | Sakshi
Sakshi News home page

ర్యాప‌ర్ రాఫ్తార్‌కు క‌రోనా.. షోలో లేన‌ట్టేనా?

Sep 10 2020 10:20 AM | Updated on Sep 10 2020 10:57 AM

Rapper Raftaar Tests Positive For COVID-19 He Feel Its A Technical issue - Sakshi

ముంబై: ప్ర‌ముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజ‌ర్, రాప‌ర్ రాఫ్తార్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అత‌నే ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించాడు. అయితే త‌న‌కు క‌రోనా రాలేదేమోన‌ని, ఏదో టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల త‌ప్పుడు రిపోర్ట్ వ‌చ్చిందేమో అని సందేహం వ్య‌క్తం చేశాడు. ఓ టీవీ రియాలిటీ షో కోసం షూటింగ్ ప్రారంభం కావ‌డానికి ముందే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రెండు సార్లు రాఫ్తార్‌కు నెగిటివ్ అనే వ‌చ్చింది. అయితే మూడోసారి నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌లో మాత్రం పాజిటివ్‌గా తేలింది. దీంతో అత‌న్ని క్వారంటైన్‌లోనే ఉండాల్సిందిగా షో నిర్వాహ‌కులు తెలిపారు. త‌మంచె పే డిస్కో, తు మేరా భాయ్ నహీ హై, స్వాగ్ మేరా దేశీ వంటి పాట‌ల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాఫ్తార్..ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. (బలవంతంగా ఒప్పించారు: రియా)

తన‌కు అనారోగ్యం కానీ, క‌రోనా ల‌క్ష‌ణాలు ఏమీ లేవ‌ని పూర్తి ఆరోగ్యంగా ఉన్న‌ట్లు తెలిపాడు. ఏదో సాంకేతిక లోపం వ‌ల్లే ఎక్క‌డో త‌ప్పు జ‌రిగి ఉండొచ్చేమోన‌ని సందేహ‌ప‌డ్డాడు. త‌దుప‌రి క‌రోనా ప‌రీక్ష‌ల కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఓ వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నాన‌ని, అభిమానులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని పేర్కొన్నాడు. ఇక ప్రిన్స్ నరులా, నిఖిల్ చినపా, నేహా దుపియాతో పాటు రాఫ్తార్ కూడా ఓ కొత్త మ్యూజిక్ ఫోలో జ‌డ్జీలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో రాఫ్తార్‌కు ముందే క‌రోనా నిర్ధార‌ణ కావ‌డంతో ఇంకొన్ని రోజులు షోను వాయిదా వేస్తారా? రాఫ్తార్ స్థానంలో ఇంకొక వ్య‌క్తిని రిప్లేస్ చేస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది. (టచ్‌లో బడాబాబులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement