Ranga Ranga Vaibhavanga Trailer: ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా

Ranga Ranga Vaibhavanga Movie Trailer Out - Sakshi

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’.  కేతికా శర్మ హీరోయిన్‌. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.

(చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరణ్‌, తారక్‌ సర్కస్‌ చేశారు.. ఆ దర్శకుడి చిత్రాలేవి నచ్చవు: ఆర్జీవీ)

చిన్నప్పటి నుంచి గొడవపడే ఓ అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు వాళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే  ఈ సినిమా కథాంశమని ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది.  ఇక ట్రైలర్‌ చివరల్లో ‘నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా’అంటూ వేష్ణవ్‌ చెప్పే డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top