Rana Interesting Reaction To Naga Chaitanya Thank You Movie Teaser, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Rana Daggubati On Thank You Teaser: థ్యాంక్‌ యూ’ టీజర్‌పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు

May 27 2022 5:15 PM | Updated on May 27 2022 6:09 PM

Rana Interesting Comment On Naga Chaitanya Thank You Teaser - Sakshi

Rana Interesting Comment On Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. జూలై 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసందే. ఇందులో చై విభిన్న పాత్రల్లో కనిపించాడు. రొమాంటి, యాక్షన్‌ సీన్స్‌ వదిలిన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ట్విటర్‌లో ఈ టీజర్‌ షేర్‌ చేస్తూ నాగ చైతన్య ‘నన్ను నేను సరిచేసుకోవాడినికే చేస్తున్న ప్రయాణమే థ్యాంక్‌ యూ’ అని క్యాపన్‌ ఇచ్చాడు. చై ట్వీట్‌పై రానా ఆసక్తిగా స్పందిచాడు. ‘నువ్వు ఇప్పటికే సరి అయిపోయావు బ్రదర్, సూపర్ టీజర్ గాయ్స్‌’ అంటూ కామెంట్‌ చేశాడు.

చదవండి: తను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్‌, దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సామ్‌..

దీంతో రానా కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కాగా విక్రమ్‌ కె కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్‌ నటిస్తుండగా.. అవిక గోర్‌ కీ రోల్‌ పోషిస్తోంది. ఇదిలా ఉంటే రానా నటించిన విరాట పర్వం జులై 1న థియేటర్లో విడుదల కానుంది.  విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుంది. ద‌గ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement