చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్! | Rana Daggubati To Play Villain In Chiranjeevi-Vasishta's 'Mega 156' - Sakshi
Sakshi News home page

Chiranjeevi: చిరు ఫాంటసీ మూవీలో ఆ తెలుగు హీరో విలన్?

Oct 24 2023 6:03 PM | Updated on Oct 24 2023 7:44 PM

Rana Daggubati Villain In Chiranjeevi Vasista Movie Chiru 156 - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది అస్సలు మర్చిపోలేడు. ఎందుకంటే 'వాల్తేరు వీరయ్య' లాంటి సూపర్‌హిట్ పడింది. మర్చిపోలేని రీతిలో 'భోళా శంకర్' డిజాస్టర్ అయింది. దీంతో తర్వాత మూవీస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అలా ఇప్పుడు ఓ కొత్త మూవీని లాంచ్ చేశాడు. ఇందులోనే రామ్ చరణ్ ఫ్రెండ్, ఓ తెలుగు హీరో విలన్ గా చేయబోతున్నాడట.

దాదాపు పదేళ్ల సినిమాకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి.. 2017లో 'ఖైదీ నం.150' అనే కమర్షియల్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అది హిట్ అయింది. ఆ తర్వాత చేసిన 'సైరా' తేడా కొట్టేసింది. ఇక 'గాడ్‌ఫాదర్' కలెక్షన్ తెచ్చుకున్నప్పటికీ హిట్ కాలేకపోయింది. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. వీటి తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు సినిమా చేయాలి. కానీ దాన్ని పక్కనబెట్టేశారు.

(ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!)

'బింబిసార' ఫేమ్ వశిష‍్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దసరా సందర్భంగా మంగళవారం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ముల్లోకాల నేపథ్య కథతో తీస్తున్న ఈ ఫాంటసీ సినిమాలో చిరు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్ అనే టాక్ వినబడుతోంది. 

ఇందులో చిరుకి విలన్‌గా రానా పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇప్పటికే 'బాహుబలి'తో తానెంటో ప్రూవ్ చేసుకున్న రానా.. ఇప్పుడు చిరు సరసన హాలీవుడ్ మూవీ 'లోకీ' తరహా పాత్ర చేయబోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సినిమాపై హైప్ పెరగడం గ్యారంటీ. ఇదిలా ఉండగా చరణ్-రానా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, క్లాస్‪‌మేట్స్ కూడా. 

(ఇదీ చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement