మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం గ్లింప్స్‌.. | Sakshi
Sakshi News home page

మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం గ్లింప్స్‌..

Published Wed, Feb 15 2023 1:11 AM

Rana Daggubati Unveils First Glimpse Of  Agni Nakshatram - Sakshi

మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీప్రసన్న నిర్మించారు.

మంగళవారం ఈ సినిమా గ్లింప్స్‌ని హీరో రానా రిలీజ్‌ చేసి, చిత్రయూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో లక్ష్మీప్రసన్న పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘అగ్ని నక్షత్రం’. రానా విడుదల చేసిన గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం:  అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్‌ భారతి. 

Advertisement
 
Advertisement
 
Advertisement