సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్ | Ramayan Movie Sai Pallavi And Ranbir Kapoor Pics Viral | Sakshi
Sakshi News home page

Ramayan Movie: 'రామాయణ్' షూటింగ్ షురూ.. అప్పుడే పిక్స్ లీక్

Apr 27 2024 2:14 PM | Updated on Apr 27 2024 2:14 PM

Ramayan Movie Sai Pallavi And Ranbir Kapoor Pics Viral

పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడి గెటప్‌లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.

ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్‌కి గురైంది. తాజాగా బాలీవుడ్‌లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.

శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement