Ramarao On Duty: ఓటీటీలో రామారావు ఆన్‌ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్‌

Ramarao On Duty Movie OTT Release Date Confirmed - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ రామారావు ఆన్‌ డ్యూటీ. తొలిసారి డిప్యూటీ కలెక్టర్‌ పాత్రను పోషించాడీ హీరో.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్‌గా నటించారు. యంగ్‌ డైరెక్టర్‌ శరత్‌ మండవ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 29న విడుదలవగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. థియేటర్‌లో పెద్దగా సక్సెస్‌ అవకపోయినా ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు రామారావు ఆన్‌ డ్యూటీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. సెప్టెంబర్‌ 15 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానున్నట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్లలో జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి!

చదవండి: లైగర్‌ రిజల్ట్‌ తర్వాత విజయ్‌ ఏం చేశాడో తెలుసా?
'నా సినిమా థియేటర్స్‌లో విడుదలై మూడేళ్లు అ‍య్యింది'

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top