Vijay Devarakonda: లైగర్‌ రిజల్ట్‌ తర్వాత విజయ్‌ ఏం చేశాడో తెలుసా?

After Liger Release Vijay Devarakonda is Back In Action Again - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం లైగర్‌. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో హైప్‌ క్రియేట్‌ చేసిన లైగర్‌ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అనుకున్నంత స్థాయిలో అందుకోలేకపోయింది. లైగర్ రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌ బాగానే జరిగినప్పటికీ విడుదల తర్వాత సీన్ మారిపోయింది.

నెగిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ లెక్కలు మారిపోయాయి. దీంతో రౌడీ హీరో ఆశలు అడియాసలయ్యాయి. అయితే సినిమా ఫలితం పక్కనపెడితే విజయ్‌ దేవరకొండ యాక్టింగ్‌కి మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అతడి కష్టమంతా సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా లైగర్‌ రిలీజ్‌ అయిన ఒకరోజు తర్వాత విజయ్‌ దేవరకొండ మళ్లీ యాక్షన్‌లోకి దిగాడు.

సినిమా రిజల్ట్‌ని పట్టించుకోకుండా తన పనుల్లో నిమగ్నమయ్యాడు. జిమ్‌లో ఉత్సాహంగా కసరత్తులు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. వందశాతం మనం ప్రయత్నం చేసినా ఫలితం మన చేతుల్లో ఉండదని విజయ్‌కి సపోర్ట్‌ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top