
దర్శకుడు పూరి జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా సినీనటి ఛార్మి ప్రత్యేకంగా విష్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పూరి ఫోటోను షేర్ చేస్తూ 'ఎటర్నల్' అంటూ ఎమోజీని జత చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'లైగర్' బాక్సాఫీస్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాకు కొద‍్ది రోజులు స్పల్ప విరామం ప్రకటించారు. తాజాగా పూరి బర్త్‌డే సందర్భంగా ఛార్మి ట్వీట్ చేయడంతో వైరలవుతోంది.
లైగర్ తర్వాత వెంటనే జనగణమన ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ చిత్రం షూటింగ్ ఆపేసినట్లు సోషల్ మీడియాలో చాలా రూమర్లు వచ్చాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది.
తాజాగా సైమా వేడుకలకు హాజరైన విజయ్‌ని అక్కడి మీడియా ‘జనగణమన’పై ప్రశ్నించగా.. ‘అవన్ని ఇప్పుడెందుకు? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి జగణమన గురించి మర్చిపోండి. సైమా వేడుకను ఎంజాయ్ చేయండి’అని రౌడీ హీరో సమాధానం ఇచ్చాడు. దీంతో నిజంగానే జగగణమన ఆగిపోయిందని, అందుకే ఆ చిత్రంపై స్పందించడానికి విజయ్ ఇష్టపడడంలేదని నెటిజన్స్ కామెంట్ చేశారు.
𝐄𝐓𝐄𝐑𝐍𝐀𝐋 ☺️#HBDPuriJagannadh @PuriConnects pic.twitter.com/lh7UyGn2tv
— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2022