Ram Pothineni : హీరో రామ్‌కు ఆ కండీషన్‌ పెట్టిన బోయపాటి.. 

Ram Pothineni Shocking Decision For Boyapati Srinu Film - Sakshi

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం హీరో రామ్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచార​ం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ కూడా ఈ కండిషన్‌కి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్‌ కోసం రామ్‌ కొత్తగా మేకోవర్‌ అవనున్నారట.కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడం, అందులోనూ పాన్‌ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top