
టాలీవుడ్‌లో విలక్షణమైన దర్శకుడు ఎవరంటే గుర్తొచ్చేది ఆయన పేరే. సంచలనాలకు పేరు పొందిన ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
(ఇది చదవండి: దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ పోస్ట్)
టాలీవుడ్ సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఓ అమ్మాయి వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కెమెరా పట్టుకుని.. ఎల్లో శారీలో ఉన్న అమ్మాయి ఫోటోలు తీస్తూ ఆ వీడియోలో కనిపించింది. అయితే ఆ వీడియోతో పాటు ఓ ప్రశ్న అడిగారు ఆర్జీవీ. ఆ వీడియోలో ఉన్నది ఎవరో చెప్పాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతానికి అర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ కాగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఆ అమ్మాయి ఎవరో కానీ కొందరు మాత్రం ఆమె చాలా అందంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె పేరును కూడా కామెంట్స్‌లో ప్రస్తావిస్తున్నారు. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి సతీశ్ అంటూ కొందరు నెటిజన్స్ తెలియజేస్తున్నారు. మరో నెటిజన్ ఏకంగా ఆ అమ్మాయి సోషల్ మీడియా ఐడీని కూడా షేర్ చేశాడు. మీలో ఎవరికైనా ఆమె గురించి తెలిస్తే చెప్పండి.
(ఇది చదవండి: విశాల్ అలా అనడం కూడా సనాతనమే : నిర్మాత )
Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2023