Ram Charan Latest Movie: ఉప్పెన డైరెక్టర్‌తో రామ్‌చరణ్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తదుపరి చిత్రంపై లేటేస్ట్ అప్ డేట్ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వారి సందేహాలకు పుల్‌స్టాప్ పెడుతూ ఆర్‌సీ16 మూవీ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ ఈ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ.. 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమవుతుంది' అంటూ హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబును ట్యాగ్ చేసింది.
దీనిపై హీరో రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు రీట్వీట్ చేశారు. బుచ్చిబాబు టీమ్‌తో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చెర్రీ శంకర్ డైరెక్షన్‌లో ఆర్‌సీ15 షూటింగ్‌లో విదేశాల్లో బిజీగా ఉన్నారు. గతంలో 'ఆర్‌సీ 16' గౌతమ్ తిన్ననూరితో ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం ఉంటుందని టీమ్ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.
మొదట జూనియర్ ఎన్టీఆర్‌కు ఆఫర్?: ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. దర్శకుడు బుచ్చి బాబు మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు డేట్స్ బ్లాక్ కావడంతో కుదరలేదని తెలుస్తోంది.
Sometimes, Revolt becomes a necessity ❤️🔥
Mega Power Star @AlwaysRamCharan & Sensational director @BuchiBabuSana team up for a powerful subject and a Pan India entertainer 💥 #RamCharanRevolts 🔥
Produced by @vriddhicinemas & @SukumarWritings
Presented by @MythriOfficial pic.twitter.com/SisvkrbJo8
— Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022
Excited about this !!
Looking forward to working with @BuchiBabuSana & the entire team.@vriddhicinemas @SukumarWritings #VenkataSatishKilaru @MythriOfficial pic.twitter.com/hXuI5phc7L
— Ram Charan (@AlwaysRamCharan) November 28, 2022
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు