Shankar Approach The South Korean Actress For Paring With Ram Charan Movie - Sakshi
Sakshi News home page

చెర్రీతో జతకట్టే ఆ అమ్మాయి ఎవరంటే!

Mar 6 2021 8:19 AM | Updated on Mar 6 2021 10:36 AM

Ram Charan Shankar Movie Is This South Korean Actress In Project - Sakshi

ఈ అమ్మాయి ఇండియన్‌ సినిమాలలో బిజీ అయితే కొసరుగా పాటలు కూడా బ్రహ్మాండంగా పాడించుకోవచ్చు!

శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ సరసన దక్షిణ కొరియా హీరోయిన్‌ సుజి నటించబోతుందనే వార్త రాగానే ‘ఎవరీ అమ్మాయి?’ అనే ఎంక్వైరీలు మొదలయ్యాయి. 2009లో టెలివిజన్‌ టాలెంట్‌ షో ‘సూపర్‌స్టార్‌ కె’ నుంచి ఎలిమినేట్‌ అయిన సుజి ఆతరువాత కాలం కలిసి వచ్చి సూపర్‌ స్టారిణీగా ఎదిగింది. సౌత్‌ కొరియన్‌ గర్ల్‌ మ్యూజిక్‌ గ్రూప్‌ ‘మిస్‌ ఏ’లో సింగర్‌గా తన టాలెంట్‌ను చాటుకుంది.

ఈ క్రమంలో 2011లో ‘డ్రీమ్‌ హై’ (టెలివిజన్‌ సిరీస్‌)తో నటిగా పరిచయం అయింది. 2012లో రోమాన్స్‌ ఫిల్మ్‌ ‘అర్కిటెక్చర్‌ 104’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకేసారి సింగర్‌ రూకీ అవార్డ్, డ్రామా రూకీ అవార్డ్, ఫిల్మ్‌ రూకీ అవార్డ్‌లు తీసుకొని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘నడిచే ఫ్యాషన్‌ హౌజ్‌’ అని సుజీని ఫ్యాన్స్‌ ముద్దుగా పిలుచుకుంటారు.

కొసమెరుపు‌: ఈ అమ్మాయి ఇండియన్‌ సినిమాలలో బిజీ అయితే కొసరుగా పాటలు కూడా బ్రహ్మాండంగా పాడించుకోవచ్చు!

చదవండి'ఆచార్య' షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న రామ్‌చరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement