రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. ఆ క్రేజీ సాంగ్‌ వచ్చేసింది! | Ram Charan's Game Changer Second Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Game Changer Song: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. ఆ క్రేజీ సాంగ్‌ వచ్చేసింది!

Sep 30 2024 4:07 PM | Updated on Sep 30 2024 4:27 PM

Ram Charan's Game Changer Second Lyrical Song Out Now

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'రా మ‌చ్చా మ‌చ్చా..' అంటూ సాగే పాటను విడుదల చేశారు.

(ఇది చదవండి: 'గేమ్ చేంజర్' నుంచి రెండో సాంగ్‌ ప్రోమో విడుదల)

ఇప్పటికే రిలీజైన 'జరగండి జరగండి' అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ కూడా మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. ఈ సాంగ్‌లో సుమారు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్‌ పాల్గొన్నారని తెలుస్తోంది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు కూడా ఈ సాంగ్‌లో స్టెప్పులేశారు. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement