'గేమ్ చేంజర్' నుంచి రెండో సాంగ్‌ ప్రోమో విడుదల | Ram Charan Game Changer Movie Second Song Promo | Sakshi
Sakshi News home page

'గేమ్ చేంజర్' నుంచి రెండో సాంగ్‌ ప్రోమో విడుదల

Sep 28 2024 6:50 PM | Updated on Sep 28 2024 7:37 PM

Ram Charan Game Changer Movie Second Song Promo

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా రెండో పాట గురించి మేకర్స్‌ సమాచారం ఇచ్చారు. ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్‌. సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి 'గేమ్ ఛేంజ‌ర్‌' అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే 'గేమ్ చేంజర్' నుంచి విడుదలైన 'జరగండి జరగండి' అనే పాట భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

గేమ్‌ చేంజర్‌ నుంచి తాజాగా రెండో సాంగ్‌ ప్రోమో విడుదలైంది. పూర్తి పాటను సెప్టెంబర్‌ 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.  'రా మ‌చ్చా మ‌చ్చా..' అనే లిరిక్స్‌తో మొదలైన ఈ సాంగ్‌లో సుమారు వెయ్యి మందికి పైగా డ్యాన్సర్స్‌ పాల్గొన్నారని తెలుస్తోంది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు కూడా ఈ సాంగ్‌లో స్టెప్పులేశారట. 

ఇదే పాట గురించి సంగీత దర్శకుడు తమన్‌, డైరెక్టర్‌ శంకర్‌ చాలా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. క్రిస్మస్ సందర్భంగా 'గేమ్ ఛేంజ‌ర్‌' సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement