రామ్ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరి అరెస్ట్! | Ram Charan's Game Changer Movie Song Leaked, Two Persons Arrest | Sakshi
Sakshi News home page

Game Changer: రామ్ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరి అరెస్ట్!

Nov 6 2023 2:54 PM | Updated on Nov 6 2023 3:14 PM

Ram Charan Game Changer Movie Song Leak Two Persons Arrest - Sakshi

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌లో రూపొందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

అయితే గతంలో గేమ్ చేంజర్ సినిమాలోని ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరిని  అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. 

అయితే దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేయనున్నారు. ఈ పాట‌ను దీపావళికి గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ కనిపించనుండగా.. అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌జే సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement