సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి చెర్రీ-శంకర్‌ సినిమా

Ram Charan And Shankar Movie Will Go On Floor In September - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతోందట. ఇందుకు తగ్గట్టుగా రామ్‌చరణ్‌ డేట్స్‌ కూడా కేటాయించేశారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్ని ఇప్పటికే శంకర్‌ సెలక్ట్‌ చేశారని భోగట్టా. సెప్టెంబర్‌ 8 నుంచి ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని టాక్‌.

ఈ సినిమా మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ను ఇండియాలోనే పూర్తి చేయనున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో చిత్రీకరిస్తారట. ఎలాగైనా 2022 జూలైకి షూటింగ్‌ పూర్తిచేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top