నేనోపాఠం నేర్చుకున్నాను | Rakul Preet Singh Gives Health Update After Suffering Injury During Workout: I Did Something Very Stupid | Sakshi
Sakshi News home page

నేనోపాఠం నేర్చుకున్నాను

Oct 20 2024 3:58 AM | Updated on Oct 20 2024 6:56 AM

Rakul Preet Singh Gives Health Update After Suffering Injury During Workout: I Did Something Very Stupid

వ్యాయామాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తనలానే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇంతకీ విషయం ఏంటంటే... వ్యాయామాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రకుల్‌ ఇటీవల హెవీ వర్కౌట్‌ చేశారు. ఈ కారణంగా ఆమెకు గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయంపై రకుల్‌ స్పందించారు. ‘‘నా ఆరోగ్యం గురించి నేనొక అప్‌డేట్‌ ఇస్తున్నాను. నేనొక పిచ్చి పని చేశాను. నా శరీరం చెప్పే మాటను నేను పట్టించుకోలేదు. హెవీ వర్కౌట్‌ చేశాను. ఇందుకు ఫలితంగా నేను గాయపడ్డాను.

ఆరు రోజులుగా నేను బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో నేను కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనిపిస్తోంది. నేను తొందరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే రెస్ట్‌ తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. అలాగే నేనొకపాఠం కూడా నేర్చుకున్నాను. మీకు మీ శరీరం ఏదైనా సిగ్నల్‌ ఇచ్చినప్పుడు పట్టించుకోండి. తేలికగా తీసుకుని బలవంతంగా వర్కౌట్స్‌ చేయకండి. నాకు తెలిసి నా శరీరం కన్నా నా బ్రెయిన్‌ స్ట్రాంగ్‌ అనుకుంటున్నాను. కానీ అన్ని వేళలా ఇది వర్కౌట్‌ కాదు. ఇక నా మేలును ఆశించి నాకు సందేశాలు పంపుతున్న వారికి థ్యాంక్స్‌. నేను త్వరలోనే కోలుకుని, మరింత స్ట్రాంగ్‌గా వస్తాను’’ అని పేర్కొన్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇదిలా ఉంటే.. 80 కేజీల బరువు ఎత్తడంవల్లే రకుల్‌కి గాయం అయిందని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement