ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్ | Rakshit Shetty Bachelor Party Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Bachelor Party OTT Release: స్టార్ హీరో తీసిన కామెడీ సినిమా.. సడన్‌గా ఓటీటీ ప్రకటన

Published Sun, Mar 3 2024 12:16 PM

Rakshit Shetty Bacheor Party Movie Ott Release Date Details - Sakshi

మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీ.. ఆ భాషలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఓటీటీలోకి మూవీ లవర్స్‌ని నవ్వించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎలాంటి హడావుడి లేకుండా ఇచ్చేశారు. దీంతో ఓటీటీ ప్రేమికులు అలెర్ట్ అయిపోయారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది?

ఓటీటీల హవా పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు కన‍్నడ హిట్ మూవీ 'బ్యాచిలర్ పార్టీ' ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 26న థియేటర్లకి వచ్చిన ఈ చిత్రం.. సోమవారం నుంచి అంటే మార్చి 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.అంటే ఈ రోజు అర్థరాత్రే. అలానే ఓటీటీలో రిలీజ్ విషయాన్ని కూడా కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పారు. అంటే సడన్ స్ట్రీమింగ్ అ‍న్నట్లే.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ)

మరోవైపు ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంది. భార్య-భర్త మధ్య ఉండే చిన్న సమస్యలతో కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అలానే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బ్యాంకాక్‌లో చేసిన సందడి కూడా బాగానే ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.

'బ్యాచిలర్ పార్టీ' కథ విషయానికొస్తే.. సంతోష్ (దిగంత్ మైకేల్) సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. పెళ్లి కూడా అయ్యింటుంది. కానీ భార్య సంధ్య(సిరి రవికుమార్) వల్ల జీవితంలో సంతోషం అనేదే ఉండదు. పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ తర్వాత నేరుగా ఇంటికొచ్చేయాలనే టైప్. అలాంటి సంతోష్ అనుకోకుండా ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత ఫ్రెండ్ మ్యాడీ (యోగా), పీటీ సర్ (అ‍చ్యుత్ కుమార్)‌ని కలుస్తాడు. ఆ తర్వాత వీళ్లు ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్తారు. చివరకు ఏమైంది? ఈ జర్నీలో ఏం తెలుసుకున్నారు? అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement