Rakhi Sawant: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్‌ సాయం చేశాడు

Rakhi Sawant: Ritesh Called Me Uneducated And Gives Fake Jewellery - Sakshi

చదువు సంధ్య లేదు అని తిట్టేవాడు, ఫేక్‌ నగలిచ్చాడు

నా అకౌంట్స్‌ హ్యాక్‌ చేశాడు

బాధను వెల్లడించిన రాఖీ సావంత్‌

ఈ ఏడాది ప్రేమికుల రోజే భర్తతో తెగదెంపులు చేసుకుంది రాఖీ సావంత్‌. అతడు తనకిదివరకే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడంటూ సోషల్‌ మీడియాలో బోరుమంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నవాడితో కలిసి ఉండేదే లేదంటూ బ్రేకప్‌ చెప్పేసింది. కొంతకాలానికే రాఖీ అదిల్‌ దురానీ అనే బిజినెస్‌మెన్‌తో ప్రేమలో పడింది. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందనుకుంటున్న క్రమంలో మాజీ భర్త రితేశ్‌ వేధిస్తున్నాడంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది రాఖీ. అన్ని రకాలుగా తనను నిలువు దోపిడీ చేసిన రితేశ్‌ సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేసి ఆ డబ్బును వాడుకుంటున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో మాజీ భర్త గురించి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పుకొచ్చింది.

'రితేశ్‌ నాకు కారు గిఫ్టిచ్చిన మాట వాస్తవమే. కానీ అది నేనెప్పుడో అతడికి తిరిగిచ్చేశాను. అతడి జ్ఞాపకాలు ఏవీ నాకు అవసరం లేదు. నా కోసం కోట్లు ఖర్చు చేశాడని చెప్పుకు తిరుగుతున్నాడు, అది పూర్తిగా అవాస్తవం. నాకు ఇచ్చిన నగలు కూడా నకిలీవే. ఓసారి మా అమ్మకు ఆరోగ్యం బాగోలేనప్పుడు నా నగలు అమ్ముదామని దుకాణానికి వెళ్తే అవి నకిలీవని తెలిశాయి. ఇలా చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదా? అని అతడికి మెసేజ్‌ చేశాను. దానికతడు స్పందిస్తూ నీకదే ఎక్కువ అని రిప్లై ఇచ్చాడు. చదువుసంధ్య లేనిదాన్నని ఎప్పుడూ తిడుతుండేవాడు. 

నా అకౌంట్స్‌ హ్యాక్‌ అయిన విషయం వార్తల్లోకెక్కడంతో అతడు వాటిని తిరిగిచ్చేశాడు. ఇప్పుడు నేను అన్నింటి పాస్‌వర్డ్స్‌ మార్చేశాను. పోలీసులకు చేసిన ఫిర్యాదు కూడా వెనక్కు తీసుకుంటాను. నిజంగా ప్రేమించేవారు కేసులు పెట్టరు. రితేశ్‌ను నేను ప్రేమించి, పెళ్లి చేసుకుంది నిజం. కానీ అతడు ప్లేటులో భోజనం పెట్టి విసిరేసేవాడు. కొట్టేవాడు. అయినా సరే నేనతడి కాళ్లు పట్టుకుని నాతో ఉండమని బతిమాలేదాన్ని. ఆ తర్వాత తనకు పెళ్లై, పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టాడని తెలిసింది. నిలువునా మోసపోయాను. మా అమ్మను ఆస్పత్రిలో చేర్పించాక ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. అప్పుడు సల్మాన్‌ ఖాన్‌ నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు నా ప్రియుడితో కొత్త జీవితం మొదలుపెడదామంటే కూడా అడ్డుపడుతున్నాడు' అని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్‌.

చదవండి: సబ్‌స్క్రిప్షన్లు ఎక్కువైపోయాయా? ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూసేయొచ్చు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top