రజనీకాంత్‌ ‘శివాజీ’ మూవీకీ 14 ఏళ్లు: అప్పటి కలెక్షన్స్‌ ఎంతంటే..

Rajinikanth Shivaji Movie 14 Years Celebretions - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తొలిసారిగా వచ్చిన చిత్రం ‘శివాజి’. ఇందులో శ్రియా హిరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బింగ్‌ సినిమా అయినప్పటికి టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కలెక్షన్‌ల వర్షం కురిపించింది. అంతటి భారీ విజయాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై నేటికి 14 ఏళ్లు.  2007 జూన్‌ 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

డబ్బింగ్‌ చిత్రమే అయిన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఇక్కడ పెద్ద చిత్రాలకు పోటీని ఇచ్చింది. ఇక ఇందులో రజనీకాంత్‌ గుండు బాస్‌గా ప్రేక్షకులను అలరించిన తీరు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరి నోట గుండుబాస్‌ అనే డైలాగ్‌ను ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది. అంతలా గుండుబాస్‌ పాత్రతో రజనీ ఆకట్టుకున్నారు. ఇక ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే డబ్బింగ్‌ సినిమా అయినప్పటికీ ‘శివాజి’ తెలుగులో 15.32 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసింది.

అప్పటి వరకు ఏ డబ్బింగ్ సినిమా కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టలేదు. ఫుల్ రన్‌లో శివాజీ అందరి అంచనాలు అందుకుంటూ 17.73 కోట్ల షేర్ వసూలు చేసింది. అప్పట్లో ఓ డబ్బింగ్ సినిమా ఇంత వసూలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. దాదాపు బయ్యర్లకు శివాజి 3 కోట్ల లాభాలు అందించింది. ఇందులో సుమన్ విలనిజం హైలైట్ కాగా మరోవైపు శ్రియా అయాయకత్వపు నటన, అందం, అభినయం ఈ సినిమాకు ప్లస్‌ అయ్యింది. అంతటి సంచలన విజయం అందించిన శివాజి వసూళ్లు ఇక్కడ ఎలా ఉన్నాయంటే..

నైజాం- 4.25 కోట్లు
సీడెడ్- 3.42 కోట్లు
ఉత్తరాంధ్ర- 2.65 కోట్లు
ఈస్ట్ గోదావరి- 1.55 కోట్లు
వెస్ట్ గోదావరి- 1.52 కోట్లు
గుంటూరు- 1.90 కోట్లు
కృష్ణా-1.60 కోట్లు
నెల్లూరు-0.84 కోట్లు ఏపీ+ తెలంగాణ: 17.73 కోట్లు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top