రాజేంద్రప్రసాద్‌ మనవరాలి 'ఎర్రచీర'.. కథ గెస్‌ చేస్తే రూ.5 లక్షలు మీవే! | Rajendra Prasad Grand Daughter Sai Tejaswini Movie Contest Details | Sakshi
Sakshi News home page

రాజేంద్రప్రసాద్‌ మనవరాలి 'ఎర్రచీర' మూవీ.. కథ గెస్‌ చేస్తే రూ.5 లక్షలు మీవే!

Apr 24 2025 6:00 PM | Updated on Apr 24 2025 6:09 PM

Rajendra Prasad Grand Daughter Sai Tejaswini Movie Contest Details

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'ఎర్రచీర'. 'ది బిగినింగ్' అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను మే రెండో వారంలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు.

మేలో రిలీజ్‌
ఆయన మాట్లాడుతూ ‘’ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఎర్రచీర కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. కంటెంట్ మాత్రం ఖతర్నాక్‌గా ఉంటుంది. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్.. అన్నీ కలగలిపి ఉండే ఈ మూవీ ఎక్కడా బోర్  కొట్టదు. సినిమా చూసే ప్రేక్షకులు కన్నీళ్లతో బయటికి వెళ్తారు అని చెప్పగలను. 

కథ గెస్‌ చేస్తే రూ.5 లక్షల బహుమతి
సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి అభినందించారు. భలే సినిమా చేశారన్నారు. ఈ సినిమాకి ఒక పోటీ ప్రకటిస్తున్నాం. సినిమా కథ కరెక్టుగా రిలీజ్‌కు ముందు గెస్ చేస్తే ఐదు లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాం. 8019246552 నంబర్‌కు కరెక్ట్ కథ చెప్పినవారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐదు లక్షలు బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు.

 

చదవండి: పాకిస్తాన్‌ సైన్యంలో ఫౌజీ హీరోయిన్‌ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి

Advertisement
 
Advertisement
Advertisement