Rajeev Kanakala Gives Clarity Over Rumours On Clashes With Suma In Earnings Matter - Sakshi
Sakshi News home page

Rajeev Kanakala: సంపాదన విషయంలో గొడవలు? రాజీవ్‌ వ్యాఖ్యలు వైరల్‌

Oct 20 2022 4:38 PM | Updated on Oct 20 2022 6:24 PM

Is Rajeev Kanakala Earning More Than Anchor Suma Income? - Sakshi

టీవీలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ ఆదాయం వస్తుందని జనాలు అనుకుంటారు. నేను సంపాదించేది నేను సంపాదిస్తాను. సవాలక్ష మంది సవాలక్ష రకాలుగా అనుకుంటారు..

సుమ- రాజీవ్‌ కనకాల.. ఒకరు బుల్లితెర స్టార్‌, మరొకరు వెండితెర ప్రముఖ నటుడు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న వీరిద్దరూ ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. అయితే సంపాదన విషయంలో వీరి మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయని తరచూ కొన్ని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ రూమర్‌పై స్పందిస్తూ రాజీవ్‌ కనకాల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

'మా మధ్య ఎప్పుడూ అభిప్రాయబేధాలు రాలేవు. సుమ వర్కింగ్‌ ఉమెన్‌, సంపాదిస్తుంది. టీవీలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ ఆదాయం వస్తుందని జనాలు అనుకుంటారు. నేను సంపాదించేది నేను సంపాదిస్తాను. సవాలక్ష మంది సవాలక్ష రకాలుగా అనుకుంటారు.. నేను అదేం పట్టించుకోను. ఆమె టీవీలో బిజీ అవకముందు నేను బోలెడన్ని సినిమాలు చేసి సంపాదించిన ప్రాపర్టీలు ఉన్నాయి. అయినా మా మధ్య అలాంటి ప్రస్తావనే రాదు. మీ దృష్టిలో.. నా కంటే సుమ సంపాదన ఎక్కువే' అని చెప్పుకొచ్చాడు రాజీవ్‌ కనకాల.

చదవండి: దమ్ముంటే అడ్డుకో.. తొడకొట్టి సవాల్‌ విసిరిన శ్రీహాన్‌
ఓరి దేవుడా దివాలి దావత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement