Prabhas - Rajamouli: నాకంటే మీకు ఆ స్టార్‌ హీరోలే ఎక్కువ..!

Rajamouli about Ram Charan And NTR With Prabhas - Sakshi

పాన్‌ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్‌' సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కలిసి ఓ ఇంటర్వూలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటర్వూలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఇపుడు మీరు చరణ్, తారక్‌ లాంటి ఇద్దరు సూపర్‌ స్టార్స్‌తో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో నన్ను గెస్ట్ అపీయరెన్స్‌లో అయినా అడగాలని అనిపించలేదా? అలా ఒకే స్క్రీన్ పై నేను, చరణ్, తారక్ ముగ్గురం ఉంటే బాగుండేది కదా..? అంటే మీరనుకున్న ఆ విజన్‌లో ఎక్కడా కనపడలేదా? అంటూ ప్రభాస్ జక్కన్నను సరదాగా ప్రశ్నించాడు. ఇక దానికి రాజమౌళి స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

డార్లింగ్‌ నువ్వు ఓ పెద్ద షిప్‌ లాంటోడివి.. ఓ సీన్‌లో ఆ పెద్ద షిప్‌ పెడితే బ్రహ్మాండగా సీన్‌ వస్తుంది అంటే షిప్‌ తీసుకొస్తాం. నేనడిగితే ప్రభాస్‌ నటిస్తాడు కాబట్టి ప్రభాస్‌ని సినిమాలో ఎక్కడ పెడదామా అని తీస్తే సినిమా బాగుండదు. సినిమాకి అవసరం అంటే మాత్రం నువ్వు ఎంత బిజీగా ఉన్నా నిన్ను ఎలాగైనా కన్విన్స్‌ చేసి తీసుకొచ్చేస్తా అంటూ రాజమౌళి బదులిచ్చాడు.

ఇక దానికి ప్రభాస్.. మీరు అనుకుంటే నాకోసం పాత్రను సృష్టించగలరు కదా? ఎలాగైనా మీకు నాకంటే చరణ్, తారక్ అంటేనే ఇష్టమని నాకు అర్థమైంది అంటూ నవ్వుకున్నాడు. ఇక దానికి రాజమౌళి స్పందిస్తూ నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా చేసినప్పుడు నాకు ఆ హీరోకంటే ఇంకెవ్వరూ ఎక్కువ కాదన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top