భోపాల్‌ గ్యాస్‌ లీకేజీపై వెబ్‌ సిరీస్‌.. ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడంటే? | The Railway Men Web Series Inspired By True Story Of Bhopal Gas Leak Gets OTT Release Date, Deets Inside - Sakshi
Sakshi News home page

The Railway Men OTT Release: భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్‌ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?

Published Thu, Oct 26 2023 1:02 PM

The Railway Men Based on Bhopal Gas Leak Gets OTT Release Date - Sakshi

భోపాల్‌ గ్యాస్‌ లీక్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తు. 1984 డిసెంబర్‌ 2, 3 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌) ప్లాంట్‌లో గ్యాస్‌ లీకేజీ ప్రమాదం సంభవించింది. మిథైల్‌ ఐసోసైనైడ్‌ అనే విషపూరిత రసాయనం విడుదలవడంతో చాలామంది ఊపిరాడక చనిపోయారు, వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గ్యాస్‌ లీకేజీ మరో 6 లక్షల మందిపై ప్రభావం చూపించింది. ఈ విషపూరిత రసాయన ప్రభావం కొన్ని తరాల పాటు కనిపించింది. ఈ దుర్ఘటన జరిగి దాదాపు 39 ఏళ్లు కావస్తోంది.

ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఓ వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకుంటోంది. అదే 'ద రైల్వే మెన్‌'. ఆర్‌ మాధవన్‌, కేకే మీనన్‌, దివ్యేందు, బాబిల్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ నాలుగు భాగాలుగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సిరీస్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ వీడియో రిలీజ్‌ చేశారు. భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ జరిగినప్పుడు రైల్వే ఉద్యోగులు సహృదయంతో అక్కడి వారికి సాయం చేసేందుకు వెళ్లారు. వందలమంది ప్రాణాలు కాపాడారు. దాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నామని డైరెక్టర్‌ శివ్‌ రావలి తెలిపాడు. ఈ థ్రిల్లర్‌ సిరీస్‌ నవంబర్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

చదవండి: వెంకటేశ్‌ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్‌ బాబు హాజరు

Advertisement

తప్పక చదవండి

Advertisement