వాలంటైన్స్‌ డే: 'రాధేశ్యామ్‌' నైట్‌ థీమ్‌ పార్టీ! | Radhe Shyam: Night Theme Party For Valentines Day | Sakshi
Sakshi News home page

Radhe Shyam: వాలంటైన్స్‌ డే కోసం నైట్‌ థీమ్‌ పార్టీ!

Feb 8 2022 7:54 AM | Updated on Feb 8 2022 8:20 AM

Radhe Shyam: Night Theme Party For Valentines Day - Sakshi

జనరల్‌గా సినిమా షూటింగ్స్‌ కోసం సెట్స్‌ వేస్తుంటారు. అలా ‘రాధేశ్యామ్‌’ సినిమా కోసం కూడా పలు సెట్స్‌ తయారు చేయించారు. అది మాత్రమే కాదు.. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ‘నైట్‌ థీమ్‌ పార్టీ’ కోసం సెట్‌ ఏర్పాటు చేయించింది ఈ చిత్రబృందం. ఈ నెల 14న రాత్రి 8 గంటల నుంచి ఈ పార్టీ ప్రారంభం కానుంది.

ఈ పార్టీ కోసం ‘రాధేశ్యామ్‌’ సినిమా కథను ప్రతిబింబించేలా సెట్స్‌ వేయించారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement