Radhe Shyam Box Office: Prabhas Movie First Day Collections details Here - Sakshi
Sakshi News home page

Radhe Shyam First Day Collections: దుమ్మురేపిన ప్రభాస్‌.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌

Mar 12 2022 11:39 AM | Updated on Mar 12 2022 11:56 AM

Radhe Shyam Movie First Day Collections - Sakshi

 పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ప్రేమకథ చిత్రం ‘రాధేశ్యామ్‌’. భారీ అంచనాల మధ్య విడుదలైన మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి.. తొలిరోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ..కలెక్షన్స్‌ పరంగా మాత్రం దుమ్ముదులిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల షేర్‌ని సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.  ముఖ్యంగా ఓవర్సీస్‌లో అయితే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీమియర్‌ తోనే  904 K డాలర్లు వసూలు చేసిందట.

(చదవండి: ‘రాధేశ్యామ్‌’మూవీ రివ్యూ)

ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అక్కడ విడుదలకు ముందే ఎక్కువ టికెట్స్‌ అమ్ముడయ్యాయి. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లు సాధించింది రాధే శ్యామ్. నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 30 కోట్లు వసూళ్ల రాబట్టింది. ఒక్క నైజాంలోనే తొలిరోజు రూ.11.87  కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం.  ఆంధ్రాలో మొత్తంగా రూ.8.5 కోట్లను రాబట్టినట్లు సమాచారం. బాలీవుడ్‌లోనూ భారీగానే వసూళ్లను రాబట్టిందట. అయితే ఎన్ని కోట్లు అదేదానిపై క్లారిటీ లేదు.

ఈ సినిమాలో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్‌ నటించాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించింది.  సౌత్‌ లాంగ్వేజెస్‌కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా, తమన్ నేపథ్య సంగీతం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement