సెలవు లేదు | Raashi Khanna talking about Tughlaq Darbar movie | Sakshi
Sakshi News home page

సెలవు లేదు

Nov 10 2020 3:37 AM | Updated on Nov 10 2020 3:37 AM

Raashi Khanna talking about Tughlaq Darbar movie - Sakshi

కోవిడ్‌ వల్ల వర్క్‌ లేకపోవడంతో స్టార్స్‌ అందరికీ హాలిడే వచ్చింది. ఇటీవలే సినిమా చిత్రీకరణలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కోవిడ్‌ బ్రేక్‌ పెద్దదే కావడంతో ఇక బ్రేక్స్‌ లేకుండా షూటింగ్స్‌ చేయాలనుకుంటున్నారు కొందరు స్టార్స్‌. అందులో రాశీ ఖన్నా ఒకరు. ‘తుగ్లక్‌ దర్బార్, అరన్‌మణై’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు రాశీ. ‘తుగ్లక్‌ దర్బార్‌’ కోసం దసరా రోజూ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆదివారాలు కూడా సెలవు తీసుకోకుండా వర్క్‌ చేస్తున్నారామె. ‘ఆదివారం కూడా మండే (సోమవారం)లానే ఉంది’ అంటూ ఓ ఫోటోను షేర్‌ చేశారు రాశీ ఖన్నా.

Advertisement
 
Advertisement
Advertisement