Pushpa Movie Song Second Single Will Be Out Soon - Sakshi
Sakshi News home page

Pushpa: ‘తగ్గేదేలే’ అంటున్న రాక్‌స్టార్‌.. అంతకు మించేలా సెకండ్‌ సింగిల్‌!

Sep 18 2021 10:42 AM | Updated on Sep 18 2021 11:18 AM

Pushpa Second Song Will Be Out Soon - Sakshi

అల్లు అర్జున్ సంగతి తెలిసిందే. ఒక కొత్త సినిమా స్టార్ట్ అయితే చాలు ఆ వెంటనే ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. తన మూవీ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే విధంగా ప్లాన్ చేస్తాడు.
అల.. వైకుంఠపురములో పాటలతో బన్ని చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ పుష్పకు అప్లై చేస్తున్నాడు.

పుష్ప మూవీ నుంచి రిలీజై ఫస్ట్ ప్యాన్ ఇండియా సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో తెల్సిందే. ఇప్పటికిప్పుడు యూట్యూబ్  చూసినా, ఏదో ఒక రికార్డ్ బద్దలవుతూ కనిపిస్తుంది. అందుకే వేడి తగ్గకుండా, మరో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది.

ఆగస్ట్ లో దాక్కో దాక్కో దుమ్మురేపడంతో, సెప్టెంబర్ లో మరో న్యూ సింగిల్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు బన్ని. అందుకు సంబంధించి ఇప్పటికే ప్లానింగ్ జరిగిపోయింది. ఈసారి డ్యూయెట్ సాంగ్ ను సింగిల్ రూపంలో విడుదల చేస్తారట. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి, ఇకపై ప్రతీ నెల ఒక సింగిల్ రిలీజ్ కానుందట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. దాక్కో దాక్కో ట్యూన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దేవి త్వరలో విడుదల కానున్న కొత్త డ్యూయెట్ తో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. అసలే బన్ని ప్రాజెక్ట్ అంటే ఇంకా రెచ్చిపోతాడు రాక్ స్టార్. 

Advertisement
 
Advertisement
Advertisement