Pushpa Movie:Rashmika Mandanna First Look Out As Srivalli- Sakshi
Sakshi News home page

Pushpa: శ్రీవల్లిగా రష్మిక.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

Sep 29 2021 10:06 AM | Updated on Sep 29 2021 7:22 PM

Pushpa Movie: Rashmika Mandanna First Look Out - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.


అయితే తాజాగా పుష్ప నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. బుధవారం(సెప్టెంబర్‌ 29) రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో… రష్మిక మందన్నా గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపిస్తోంది.  చెవులకు కమ్మలు పెట్టుకుంటూ.. తన అందాలను ఆరబోసింది రష్మిక. పోస్టర్‌ బట్టి చూస్తే ఇందులో ఆమె డీగ్లామర్‌ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. శ్రీవల్లి ప్రేమను చూసి పుష్పరాజ్ మనసు కరిగింది అంటూ ట్వీట్ చేసింది చిత్రయూనిట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement