
నా గురించి చెప్పాలంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు యూఎస్‌లోనే ఉంటారు. నాకు మగపిల్లలు లేరని ఎప్పుడూ బాధపడలేదు...
Pushpa Movie Actress Kalpalatha: ఏ సినీప్రియుడిని కదిలించినా అంతా పుష్ప గురించే మాట్లాడుతున్నారు. అంతలా పుష్ప సినిమా మార్మోగిపోతోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అంతటా పుష్ప ప్రభంజనం కొనసాగుతోంది. బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ రేంజ్‌లో పుష్ప హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. తాజాగా పుష్పరాజ్‌కు తల్లిగా నటించిన కల్పలత ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.
'అల్లు అర్జున్ షూటింగ్‌కు వచ్చాడంటే చాలావరకు తన పాత్ర గురించే ఆలోచిస్తుంటాడు. తన వ్యక్తిగత విషయాలను సైతం పక్కనపెట్టి పాత్రలో లీనమైపోతాడు. అంత డెడికేషన్ ఆయనది. ఇక నా గురించి చెప్పాలంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు యూఎస్‌లోనే ఉంటారు. నాకు మగపిల్లలు లేరని ఎప్పుడూ బాధపడలేదు. కానీ బన్నీతో సినిమా షూటింగ్ అయ్యాక మాత్రం చాలా బాధపడ్డాను. బన్నీ నాకు సపోర్ట్‌గా చేయి పట్టుకోవడం, నేనున్నానంటూ కళ్లతోనే ధీమా ఇవ్వడం.. ఇవన్నీ చూసి ఏడ్చేశాను. ఒక కొడుకుంటే ఇంత బాగా చూసుకునేవాడేమో అనిపించింది. కొడుకు ప్రేమ ఇంత బాగుంటుందా? పుష్పరాజ్‌లాంటి కొడుకుంటే మరింత బాగుండు అని ఫీలయ్యాను. ఇదే మాట బన్నీకి చెప్తే ఆయన దగ్గరకు తీసుకుని ఓదార్చాడు' అంటూ ఎమోషనల్ అయింది కల్పలత.