
సీనియర్ హీరో అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం 'సీతా పయనం'. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నిరంజన్ , అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్‌కు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కన్నడ హీరో ఉపేంద్రపై పుష్ప డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లే నా సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్‌గా ఉందని అన్నారు. ఎందుకంటే ఉపేంద్ర తెరకెక్కించిన ఓమ్, ఏ, ఉపేంద్ర లాంటి సినిమాలే నాకు ఆదర్శమని తెలిపారు. ఆడియన్స్‌కు పిచ్చి, మ్యాడ్ తెప్పించే కల్ట్ మూవీస్ ఆయన మనకిచ్చారు. ఆయనలా కేవలం 3 సినిమాలు తీస్తే ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చన్నారు. నేనైతే తప్పనిసరిగా రిటైర్ అయ్యేవాడినని సుకుమార్ నవ్వుతూ మాట్లాడారు. ఉపేంద్ర నుంచే స్క్రీన్ ప్లేను తాను తస్కరించానని సుకుమార్ అన్నారు.