ముచ్చటగా మూడోసారి

నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో ‘శివమణి’ సూపర్’ చిత్రాలు తెరకెక్కాయి. మూడోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుందన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చేస్తున్నారు. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు పూరి జగన్నాథ్ తన తొలి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫైటర్’తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాక పూరి, నాగార్జున చిత్రం సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి