'లైగర్‌' సెట్‌లో పూరి జగన్నాథ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ | Puri Jagannadh Birthday Celebrations On The Sets Of Liger | Sakshi
Sakshi News home page

Puri Jagannadh: గోవాలో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్న పూరి జగన్నాథ్‌

Sep 28 2021 5:00 PM | Updated on Sep 28 2021 6:18 PM

Puri Jagannadh Birthday Celebrations On The Sets Of Liger   - Sakshi

Puri Jagannadh Birthday Celebrations: డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన బర్త్‌డేను లైగర్‌ సెట్లో జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్‌ దేవేరకొండ, చార్మీ సహా మిగతా యూనిట్‌ సభ్యుల మధ్య పూరి కేక్‌ కట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో 'లైగర్‌' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో విజయ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల కానుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Charmy: మందు గ్లాస్‌తో పూరికి బర్త్‌డే విషెస్‌ తెలిపిన చార్మీ

Advertisement
 
Advertisement
Advertisement