సైకో సందేశం

Psycho Movie First Schedule Completed - Sakshi

కార్తీక్‌ సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైకో’. అటు హీరోగా, ఇటు డైరెక్టర్‌గా ఇదే ఆయనకు తొలి చిత్రం. లావణ్య సమర్పణలో యాదవ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ కొత్త పాయింట్‌కి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ జోడించి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుంది. మా చిత్రం సమాజానికి ఓ కొత్త సందేశం ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలం’’ అన్నారు కార్తీక్‌ సాయి. డాలి షా, నేహా దేశ్‌పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్యన్, సంగీతం: సిద్దార్‌ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తోట సతీష్, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రియా, సంతోష్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top