జన నాయకుడు విజయ్‌కి గొప్ప ఫేర్‌వెల్‌: నిర్మాత వెంకట్‌ కె. నారాయణ | Producer Venkat K Narayana shares insights on Thalapathy Vijay Jana Nayakudu releasing on July 23 | Sakshi
Sakshi News home page

జన నాయకుడు విజయ్‌కి గొప్ప ఫేర్‌వెల్‌: నిర్మాత వెంకట్‌ కె. నారాయణ

Jul 22 2026 3:47 AM | Updated on Jul 22 2026 11:59 AM

Producer Venkat K Narayana shares insights on Thalapathy Vijay Jana Nayakudu releasing on July 23

‘‘జన నాయకుడు’ అనుకున్నప్పుడు ఇబ్బందులు రావొచ్చని అనుకున్నాం. ‘ఇది నా చివరి సినిమా... దీని తర్వాత రాజకీయాల్లోకి వెళ్తున్నాను... కొన్ని సమస్యలు వచ్చే చాన్స్‌ ఉంది’ అని విజయ్‌గారు కూడా ముందే చె΄్పారు. అయితే రిలీజ్‌ సమయంలో, థియేటర్స్‌ విషయంలో అడ్డంకులు రావచ్చని మాత్రమే భావించాం. కానీ సెన్సార్, పైరసీ, కోర్టు వ్యవహారాలు... ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని ఊహించలేదు. ఈ కారణంగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా జూలై 23న రిలీజ్‌ అవుతోంది.

ఇందులో మంచిని చూడాలంటే విజయ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా విడుదలవుతుండటం ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహం ఇస్తోంది’’ అని నిర్మాత వెంకట్‌ కె. నారాయణ (కేవీఎన్‌) తెలి  పారు. తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్‌ నటించిన చిత్రం ‘జన నాయకుడు’. హెచ్‌. వినోద్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌పై వెంకట్‌ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది.          ఈ సందర్భంగా వెంకట్‌ కె. నారాయణ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నాకు సినిమాలంటే ఇష్టం. ముందుగా ఫిల్మ్‌ ఫైనాన్స్, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగుపెట్టాను.

రాజమౌళిగారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను కర్ణాటకలో పంపిణీ చేశాను. డిస్ట్రిబ్యూషన్‌ తర్వాత ప్రోడక్షన్‌లోకి వచ్చాను. ‘జన నాయకుడు’ కథతో విజయ్‌గారిని కలవగా ఒక్క మీటింగ్‌లోనే ఆయన ఈ సినిమాని ఓకే చేశారు. ఈ సినిమా విజయ్‌గారికి గొప్ప ఫేర్‌వెల్‌లాంటిది. ఆయన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. అదేవిధంగా ప్రేక్షకులకు కూడా గొప్ప అనుభూతిని ఇస్తు్తంది.

విజయ్‌గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న తొలి సినిమా ‘జన నాయకుడు’. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 నుంచి 8,000 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవిగారంటే అభిమానం. అందుకే తెలుగులో మొదటి సినిమా ఆయనతోనే చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ‘మెగా 158’ సినిమా నిర్మించడం హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement