ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్‌కేఎన్‌ | Producer SKN Book A Theatre For Sodara Movie Special Premiere | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్‌కేఎన్‌

Apr 24 2025 2:01 PM | Updated on Apr 24 2025 3:14 PM

Producer SKN Book A Theatre For Sodara Movie Special Premiere

పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా కూడా విజయం సాధించాలని కోరుకునే నిర్మాతలతో ఎస్‌కేఎన్‌ ఒకరు.  వీలున్నంత వరకు చిన్న సినిమా ప్రమోట్ అవ్వడానికి తన వంతు సహాయం అందిస్తుంటాడు. ఇప్పుడు ఈ కోవలోనే ఇటీవల సంపూర్నేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటించిన  సోదరా ట్రైలర్‌ విడుదల వేడుకకు అతిథిగా హాజరైన ఎస్‌కేఎన్‌, ఈ చిత్రం ఓ స్పెషల్‌ ప్రీమియర్‌ను తను సొంతంగా థియేటర్‌ బుక్‌ చేసుకుని, తన స్నేహితులకు, శ్రెయోభిలాషులకు ఈ సినిమా చూపిస్తానని హామీ ఇచ్చాడు. 

అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో మాట మీద నిలబడటం చాలా తక్కువగా ఉంటుందని, ఒకవేళ ఏదైనా సపోర్ట్‌ చేస్తామని చెప్పిన అది ప్రకటనల వరకు పరిమితం అవుతుందనే అపోహ కొందరిలో ఉంటుంది. అయితే ఎస్‌కేఎన్‌ మాత్రం తను ఒక సారి మాట ఇస్తే తప్పకుండా నేరవేరుస్తుంటాడు. ఈ కోవలోనే ఎస్‌కేఎన్‌ సోదరా చిత్రం స్పెషల్‌ ప్రీమియర్‌ను తన సొంత ఖర్చుతో ఈ రోజు అనగా గురువారం ఏప్రిల్‌ 24న సాయంత్రం ఏషియన్‌ అల్లు అర్జున్‌ '(AAA)  మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో ఏర్పాటు చేశాడు. 

 సోదరా చిత్రాం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా ఎస్‌కేఎన్‌ ఎవరికైనా ఆపద ఉందని తెలిసినా ఆర్థికంగా ఆదుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి  హీరో అభిమానులకు కూడా వారికి ఏదైనా ఆపద ఉంటే ట్విట్టర్‌లో స్పందించి వారిని ఆదుకున్న ఘటనలు కూడా ఉన్నాయి

Advertisement
 
Advertisement
Advertisement