మీ డ్రీమ్‌ నెరవేరాలి : ‘దిల్‌’ రాజు | Producer Dil Raju Appreciates Dream Boy Movie Team | Sakshi
Sakshi News home page

'ఇప్పుడున్న ట్రెండ్‌కి ఈ తరహా చిత్రాలు బాగా నచ్చుతాయి'

Mar 26 2021 4:16 PM | Updated on Mar 26 2021 4:25 PM

Producer Dil Raju Appreciates Dream Boy Movie Team - Sakshi

‘‘డ్రీమ్‌ బాయ్‌’ ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌ చాలా బాగుంది. ప్రజెంట్‌ ట్రెండ్‌కి ఈ తరహా చిత్రాలు బాగా నచ్చుతాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. చిత్ర యూనిట్‌కి నా అభినందనలు’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. సాయితేజ, హరిణి రెడ్డి జంటగా రాజేష్‌ కనపర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డ్రీమ్‌ బాయ్‌’. సెవెన్‌ వండర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రేణుక నరేంద్ర నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌ను ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. రాజేష్‌ కనపర్తి మాట్లాడుతూ– ‘‘మా సినిమా అనుకున్న సమయంలో పూర్తి కావడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. రాజుగారి ఆశీర్వాద బలం, రేణుకా నరేంద్ర సంకల్ప బలంతో ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘నేటి ట్రెండ్‌కి అనుగుణంగా ‘డ్రీమ్‌ బాయ్‌’ని రాజేష్‌ కనపర్తి మలిచాడు’’ అన్నారు రేణుకా  నరేంద్ర. ‘‘సినిమా విజయంపై మేమంతా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వై.కె. నరేంద్ర.

చిరంజీవి మాటలే స్ఫూర్తి
‘‘ఇప్పటి వరకూ చిన్న చిన్న పాత్రలు చేసిన నేను ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ద్వారా హీరోగా వస్తున్నాను. ‘ఎంతో కష్టపడాలి.. అప్పుడే విజయం వరిస్తుంది’ అని చెప్పిన హీరో చిరంజీవి గారి మాటలే నాకు స్ఫూర్తి. ఎంతైనా కష్టపడతాను’’ అని పవణ్ తేజ్‌ కొణిదెల అన్నారు. అభిరామ్‌ ఎమ్‌. దర్శకత్వంలో పవణ్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో రాజేష్‌ నాయుడు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో– ‘‘నా నమ్మకాన్ని అభిరామ్‌ నిలబెట్టాడు’’ అన్నారు రాజేష్‌ నాయుడు. ‘‘మెగా ఫ్యామిలీకి చెందిన పవణ్  మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నారని తెలియడంతో వెళ్లి కథ చెప్పాను. ఆయనకు నచ్చడంతో నిర్మాతని కలవగానే ఈ సినిమా ఓకే అయ్యింది’’ అన్నారు అభిరామ్‌. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌  మేఘన, సంగీత దర్శకుడు కార్తీక్‌ కొడకండ్ల, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్, నోయెల్, ‘హుషారు’ హీరో దినేష్‌ తేజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement