తిరిగిచ్చే సమయం వచ్చింది

Producer Dil Raju 50th Birthday - Sakshi

– ‘దిల్‌’ రాజు

‘దిల్‌’ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు పలువురు ప్రముఖ సినిమా తారలు కదిలి వచ్చారు. శుక్రవారం (డిసెంబర్‌ 18) ఆయన బర్త్‌డే. గురువారం ‘దిల్‌’ రాజు స్వగృహంలో జరిగిన వేడుకలో చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, నాగచైతన్య, నితిన్, వరుణ్‌తేజ్, విజయ్‌ దేవరకొండ, సాయి శ్రీనివాస్, ప్రకాశ్‌రాజ్, కన్నడ స్టార్‌ యశ్‌ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు  సందర్భంగా ‘దిల్‌’ రాజు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లవుతోంది.
 

ఈ పాతికేళ్లలో ఇండస్ట్రీ నాకెంతో పేరుతో పాటు డబ్బును కూడా ఇచ్చింది. ఇన్నేళ్ల కెరీర్‌లో జయాపజయాలు ఉన్నాయి. అన్నింటినీ దాటి ఇక్కడిదాకా వచ్చాను. ఈ ప్రయాణంలో నాకెంతోమంది సాయం చేసి, ఈ స్థాయిలో నిలబడటానికి కారణం అయ్యారు. ఇప్పుడు తిరిగిచ్చే సమయం వచ్చింది. ముఖ్యంగా సాయం కోరి రోజూ ఎంతోమంది వస్తుంటారు. అలా వచ్చేవారిలో ఎంతమంది నిజం చెబుతున్నారో మాకు తెలియదు. అందుకే ఒక కమిటీని ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన విద్య, వైద్య సౌకర్యాలు సమకూర్చాలనుకుంటున్నా. దానికి మీడియా ప్రతినిధుల సాయం కూడా ఉంటే నిజంగా అవసరాల్లో ఉన్నవారికి సాయం అందుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు.


భార్య వైగా, కుమార్తె హన్షితలతో ‘దిల్‌’ రాజు


శిరీష్, విజయ్, రామ్, రామ్‌చరణ్, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top