పొలిమేర 3 ఉంటుంది | Producer Bunny Vasu Speech at Polimera 2 Trailer Launch | Sakshi
Sakshi News home page

పొలిమేర 3 ఉంటుంది

Oct 15 2023 4:25 AM | Updated on Oct 15 2023 4:25 AM

Producer Bunny Vasu Speech at Polimera 2 Trailer Launch - Sakshi

‘సత్యం’ రాజేశ్, డా. కామాక్షీ భాస్కర్ల, ‘గెటప్‌’ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ హక్కులను పంపిణీదారుడు వంశీ నందిపాటి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన వేడుకకు అతిథులుగా హాజరైన దర్శకుడు హరీష్‌ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత ‘బన్నీ’ వాసు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ తరహా సినిమాలను థియేటర్స్‌లో చూస్తే ఆడియన్స్‌ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు. ‘‘పొలిమేర 1’  మాదిరి ‘పొలిమేర 2’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు హరీష్‌ శంకర్‌. ‘‘ఫస్ట్‌ పార్ట్‌ చూడనివారికి కూడా ‘పొలిమేర 2’ స్క్రీన్‌ప్లే అర్థం అవుతుంది. ‘పొలిమేర 3’ కూడా ఉంటుంది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘పొలిమేర’కు మించి ‘పొలిమేర 2’ ఉంటుంది. సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్‌ విశ్వనాథ్‌.

Advertisement
 
Advertisement
Advertisement