Producer Bandla Ganesh Funny Comments On Hero Raviteja Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Bandla Ganesh: విరాట్‌ కోహ్లీ, మెస్సీలాగా వన్‌మ్యాన్‌ షో: బండ్ల గణేశ్

Dec 30 2022 3:35 PM | Updated on Dec 30 2022 4:33 PM

Producer Bandla Ganesh Crazy Comments On Hero Raviteja Goes Viral - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘ధమాకా. ఈనెల 23న విడుదలైన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్‌ ఎలిమెంట్స్‌.. శ్రీలీల గ్లామర్‌, డ్యాన్స్‌ కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. తాజాగా ఈ చిత్రయూనిట్ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత బండ్ల గణేశ్‌ రవితేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. రవితేజను పొగుడుతూ సక్సెస్ మీట్‌ సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. టాలీవుడ్‌లో 12 మంది దర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని కొనియాడారు.

నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. 'ధమాకా వేడుకకు నేను వస్తానని ముందే ఫోన్‌ చేసి చెప్పి మరీ వచ్చా. ఇప్పటివరకు ఆస్తమించిన రవిని చూశాం. ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి నేను మాట్లాడుదామని వచ్చా. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. నేను రవితేజ ఫ్యాన్‌ అని చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి. 12 మంది దర్శకులను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. అదృష్టం కలిసొచ్చిన వాళ్లు సూపర్‌స్టార్లు, మెగాస్టార్లు అవుతారు. పదేళ్లయినా రవితేజ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. కొంతమంది రవితేజ పని అయిపోయిందనుకుంటారు. ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఆయన ఒక అరాచకం. రవితేజను చూస్తే నల్లమల అడవుల్లో నిగనిగలాడే నల్లతాచులా ఉన్నాడు. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా ప్లేయర్‌ మెస్సీ, క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీలా రవితేజ వన్‌మ్యాన్ షో చూపించాడు. దటీజ్‌ రవితేజ. ఎప్పుడేం చేయాలో, ఎవరిని ఎప్పుడు పైకి తేవాలో తెలిసిన వ్యక్తి రవితేజ. ధమాకాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన అద్భుతంగా కనిపించాడు.' అని ఉద్వేగభరితంగా ప్రసంగింంచారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement