నో బ్రేక్‌ | Priyanka Chopra is joining Keanu Reeves in Matrix 4 | Sakshi
Sakshi News home page

నో బ్రేక్‌

Aug 15 2020 6:24 AM | Updated on Aug 15 2020 6:24 AM

Priyanka Chopra is joining Keanu Reeves in Matrix 4 - Sakshi

లాక్‌డౌన్‌ సమయాన్ని భర్త నిక్‌ జోనస్‌తో కాలిఫోర్నియాలోనే గడిపారు ప్రియాంకా చోప్రా. ఈ మూడు నెలల బ్రేక్‌ తర్వాత మళ్లీ షూటింగ్‌కి సిద్ధమయ్యారామె. ‘మ్యాట్రిక్స్‌ 4’ షూటింగ్‌ లో పాల్గొనబోతున్నారు. ఇందులో ప్రియాంక కీలక పాత్ర చేస్తున్నారు. కీయాను రీవెస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ‘మ్యాట్రిక్స్‌’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం. ఆల్రెడీ లాక్‌డౌన్‌ ముందు నటీనటులందరూ యాక్షన్‌ సన్నివేశాల వర్క్‌షాప్‌లో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుత షెడ్యూల్‌ జర్మనీలో జరగనుందని సమాచారం. చిత్రబృందమంతా జర్మనీ చేరుకున్నట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement