ప్రియమైన థ్రిల్‌ | Sakshi
Sakshi News home page

ప్రియమైన థ్రిల్‌

Published Sat, May 27 2023 3:48 AM

Priyamaina Priya Movie Trailer and Audio Launch - Sakshi

అశోక్‌ కుమార్, లీషా ఎక్లెయిర్స్‌ హీరో హీరోయిన్‌గా ఏజే. సుజిత్‌ దర్శకత్వం వహించిన సైకో థ్రిల్లర్‌ ‘ప్రియమైన ప్రియ’. గోల్డెన్‌ గ్లోరి బ్యానర్‌ పై సీతారామ్‌ యాదవ్‌ నిర్మాణ నిర్వహణ సారథ్యంలో సుజిత్, బాబు నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో నిర్వహించింది.

ఈ  వేదికపై హీరో అశోక్‌ మాట్లాడుతూ– ‘‘మంచి సైకో థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రంలో నేనే హీరో, నేనే సైకో. యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే చిత్రమిది’’ అన్నారు. ‘‘మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నా కెరీర్‌లో వందో చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్‌ దేవా. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్‌ దామోదర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షా, సహ–నిర్మాత: కె. లక్ష్మీకాంత్‌.

Advertisement
Advertisement