Prithviraj Sukumaran Kaduva Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Kaduva Movie Release: 5 భాషల్లోకి పృథ్వీరాజ్‌ ‘కడువా’ మూవీ, రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Jun 21 2022 6:08 PM | Updated on Jun 21 2022 6:16 PM

Prithviraj Sukumaran Kaduva Movie Releasing On June 30 In Theatres - Sakshi

మలయాళ స్టార్​ హీరో పృథ్వీరాజ్​ సుకుమారన్ తాజా చిత్రం కడువా. షాజీ కైలాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భీమ్లా నాయక్‌ ఫేం సంయుక్తి మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యాక్షన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని జూన్‌ 30 విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు పృథ్వీరాజ్‌ ట్వీట్‌ చేస్తూ కడువా విడుదల తేదీని వెల్లడించాడు. 

చదవండి: పూజాకు నిర్మాతలు షాక్‌, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!

మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అలాగే అర్జున్‌ అశోక్‌, సిద్ధిక్‌, అజు వర్గీస్‌, దిలీష్‌ పోతన్‌ తదితరలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా మ్యాజిక్‌ ఫ్రేమ్స్‌, పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లో లిస్టిన్‌ ష్టీఫెన్‌, సుప్రియా మీనన్‌లు ఈ సినిమాను నిర్మించారు.  జెక్స్‌ బిజోయ్‌ సింగీతం అందించాడు.  భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ పోలీసు పాత్రలో అలరించానున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement