
ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టీవీ షోలలో అనేక జిమ్మిక్కులు, గిమ్మిక్కులు చేస్తుంటారు. లేనిపోని లవ్ ట్రాక్‌లు సృష్టించడం, ఏదో పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమో ఎడిట్ చేయడం, షో మధ్యలో నుంచి వెళ్లిపోతున్నట్లు యాక్ట్ చేయడం.. అబ్బో, ఇలా చాలానే ఉంటాయి. తాజాగా ఫ్యామిలీ స్టార్స్ షో ప్రోమోలో కూడా ఇలాంటి స్టంటే చేసినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ (Prince Yawar) ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా స్టేజీపై జబర్దస్త్ పవిత్రకు ఓ మాట చెప్పాలంటూ సిగ్గుపడ్డాడు.

స్టేజీపై ప్రపోజ్!
అతడు ఏం చెప్తాడో ఏంటోనని కంగారుపడ్డ పవిత్ర.. ఏయ్, పిచ్చిలేశిందా?మా అమ్మ ఇక్కడే ఉంది అని బదులిచ్చింది. అయినా వెనక్కు తగ్గని యావర్.. ప్లీజ్ అని బతిమాలడంతో పవిత్ర నడుచుకుంటూ స్టేజీ మధ్యలోకి వచ్చింది. దీంతో యావర్.. నిజం చెప్తున్నా పవిత్ర.. ఐ లవ్యూ అంటూ ఆమెను ఎత్తుకుని తిప్పాడు. అయితే ఇది చూసిన జనాలు.. మీరు చేసినవన్నీ నమ్మడానికి రెడీగా లేమని బదులిస్తున్నారు.
గతంలో బ్రేకప్
బుల్లితెరపై కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న పవిత్ర.. సంతోష్ అనే వ్యక్తిని గతంలో ప్రియుడిగా పరిచయం చేసింది. లెక్కలేనంత ప్రేమ చూపించిన అతడిని చివరి శ్వాస వరకు వదలనని పేర్కొంది. 2023 నవంబర్‌లో ప్రియుడు తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్ చేస్తూ తమ ప్రేమకు ఇంట్లో వాళ్లు కూడా పచ్చజెండా ఊపారంది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేలోపు పవిత్ర యూటర్న్ తీసుకుంది. గతేడాది వాలంటైన్స్‌డే రోజు.. వారు బ్రేకప్ చెప్పుకున్న విషయాన్ని వెల్లడించింది.
చదవండి: పుష్ప విలన్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్.. స్పెషల్ ఏంటి?