Prasanth Varma-Teja Sajja 'HanuMan' Official Teaser is Out Now! - Sakshi
Sakshi News home page

HanuMan Teaser : అదిరిపోయిన 'హనుమాన్‌' టీజర్‌.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్‌ వర్మ

Published Mon, Nov 21 2022 3:22 PM

Prasanth Varma Teja Sajja Hanuman Teaser Is Out Now - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్‌. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

కొండలు, లోయలు, జలపాతాల నడుమ విజువల్‌ వండర్‌గా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా  రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయనున్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement