'కరావళి' ప్రోమో అదిరిపోయిందంతే! | Sakshi
Sakshi News home page

Karavali Movie: అటు హీరో.. ఇటు గేదె జననం ఒకేసారి.. కరావళి ప్రోమో చూశారా?

Published Mon, Dec 11 2023 3:20 PM

Prajwal Devaraj Karavali Movie First Look and Promo Released - Sakshi

డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. ‘అంబి నింగే వయసైతో’ అనే కన్నడ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గాణిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిలింస్‌ బ్యానర్‌తో కలిసి గురుదత్త గాణిగ ఫిలిం బ్యానర్ మీద గురుదత్త గాణిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబళ  పోటీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమా ఫస్ట్ లుక్, ప్రోమోలను సోమవారం విడుదల చేశారు.

ప్రజ్వల్ దేవరాజ్ ఇందులో ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో కనిపించారు. మహిషా అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే. ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్‌లో కనిపించే షాట్ అదిరిపోయింది.

చూస్తుంటే పాన్ ఇండియాకు పర్‌ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్లుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా అదే రేంజులో ఉన్నాయి. మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు,  మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గాణిగ తెలిపారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి: ప్రియాంకకు సపోర్ట్‌ చేయను.. గీతూ ప్రశ్నలకు సమాధానాలు దాటేసిన శోభ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement