యాక్షన్‌ చేయబోతున్న ప్రభుదేవా.. కొత్త చిత్రం ప్రారంభం | Prabhu Deva Started New Movie in Tamil | Sakshi
Sakshi News home page

Prabhu Deva: యాక్షన్‌ చేయబోతున్న ప్రభుదేవా.. కొత్త చిత్రం ప్రారంభం

Sep 28 2021 10:11 AM | Updated on Sep 28 2021 10:12 AM

Prabhu Deva Started New Movie in Tamil - Sakshi

డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవా డాన్సర్‌గానే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్‌ అవతారం ఎత్తనున్నారు...

డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవా డాన్సర్‌గానే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్‌ అవతారం ఎత్తనున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా శ్యామ్‌ రోట్రిక్స్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

జాయ్‌ ఫిలిం బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జాన్‌ బ్రట్టో నిర్మిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్‌  ఎంటర్ఓ‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో నటుడు జాన్‌ విజయ్, వీటీవీ గణేష్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంగీతాన్ని, విఘ్నేష్‌ చాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ.. ప్రభుదేవాను ఈ చిత్రంలో ఫుల్‌ యాక్షన్‌ హీరోగా చూడబోతున్నారని  తెలిపారు.

చదవండి: కృత్రిమ కాలుతో ప్రభుదేవా.. పోస్ట్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement