‘మై డియర్‌ భూతం’ అంటున్న ప్రభుదేవా | Sakshi
Sakshi News home page

My Dear Bootham : ‘మై డియర్‌ భూతం’ అంటున్న ప్రభుదేవా

Published Sun, Jun 19 2022 8:10 AM

Prabhu Deva My Dear Bootham First Look Poster Out - Sakshi

‘మై డియర్‌ భూతం’ అంటున్నారు ప్రభుదేవా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం టైటిల్‌ ఇది. ఎన్‌. రాఘవన్‌ దర్శకత్వంలో రమేష్‌ పి. పిళ్లయ్‌ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో  శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌ అధినేత ఏఎన్‌ బాలాజీ విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌  చేశారు.

‘‘ఈ ఫ్యాంటసీ సినిమాలో ప్రభుదేవా జీనీ పాత్ర చేశారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీనీ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రమ్యా నంబీశన్‌ కీలక పాత్ర చేసిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమాన్, కెమెరా: యూకే సెంథిల్‌ కుమార్‌.     

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement