Prabhas Special Birthday Wishes To Kriti Sanon, Post Went Viral - Sakshi
Sakshi News home page

Prabhas Post Viral: హీరో​యిన్‌పై ప్రభాస్‌ ఆసక్తికర పోస్ట్‌.. ‘నీ మ్యాజిక్‌ చూసేందుకు వెయింటింగ్‌’

Jul 27 2022 4:59 PM | Updated on Jul 27 2022 5:51 PM

Prabhas Special Birthday Wishes to Kriti Sanon Shares Interesting Post - Sakshi

సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ ఓ హీరోయిన్‌పై ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ తప్పిదే సోషల్‌ మీడియాపై పెద్దగా ఆసక్తి చూపని ప్రభాస్‌ హీరోయిన్‌ గురించి పోస్ట్‌ పెట్టడంతో ఆసక్తి నెలకొంది. దీంతో ప్రభాస్‌ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. నేడు కృతి సనన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ప్రభాస్‌ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫొటో షేర్‌ చేశాడు. అంతేకాదు దీనికి ఆసక్తికర క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా నీ మ్యాజిక్‌ని ప్రపంచం చూసేంతవరకు వేచి ఉండలేనంటూ వ్యాఖ్యానించాడు.

చదవండి: రణ్‌వీర్‌కు వెర్రి ఎక్కువ.. తన నుంచి ఇది ఆశించడం సహజమే: నటి

‘పుట్టినరోజు శుభాకాంక్షలు కృతి సనన్. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆదిపురుష్ సినిమాలో మీ మ్యాజిక్ ని ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సలార్‌, ప్రాజెక్ట్‌ కె చిత్రాల షూటింగ్‌తో ఫుల్‌ బిజీ అయిపోయాడు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ ఆది పురుష్‌ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసుకుని ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. ఇందులో ప్రభాస్‌ సరసన కృతిసనన్‌ నటించింది. అలాగే బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్ విలన్‌గా చేస్తున్నాడు. మైథలాజికల్‌ చిత్రంగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్‌ రాముడిగా చేస్తుండగా.. కృతి సీతగా కనిపించనుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. 

చదవండి: ఫ్యాన్స్‌కి షాక్‌.. ఏడాదికే బ్రేకప్‌ చెప్పుకున్న ‘బిగ్‌బాస్‌’ జోడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement